విజయవాడ: కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్ కు పంపుతూ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణలంక సీఐగా మురళీ కృష్ణను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పలు పాత కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయికృష్ణ మార్కాపురంలో ఉండగా… విజయవాడ కృష్ణలంక పోలీసులు వచ్చి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా సీఐ నాగరాజు పై రౌడీషీటర్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై నిన్న ఏపీ హైకోర్టులో విచారణ జరగ్గా…. ఈ నెల 29న సాయి కృష్ణను తమ ముందు హాజరు పర్చాలని హైకోర్టు ఆదేశించింది.