యెమెన్‌ స్పైడర్‌ మ్యాన్‌గా గుర్తింపు పొందిన అల్‌ ఖఖా ఇబ్న్‌ అంతర్‌ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు ధృవీకరించారు. 30 ఏండ్ల అంతర్‌ ఇప్పటికే ఎన్నో పెద్ద కొండలను సునాయాసంగా ఎక్కి గుర్తింపు పొందాడు.

సనా, జూన్‌ 14 : యెమెన్‌ స్పైడర్‌ మ్యాన్‌గా గుర్తింపు పొందిన అల్‌ ఖఖా ఇబ్న్‌ అంతర్‌ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు ధృవీకరించారు. 30 ఏండ్ల అంతర్‌ ఇప్పటికే ఎన్నో పెద్ద కొండలను సునాయాసంగా ఎక్కి గుర్తింపు పొందాడు. అతను ధాలేలోని దక్షిణ ప్రాంతంలో ఉండే హర్దా దామ్‌ అనే అగ్నిపర్వతం కొండను ఎక్కేందుకు ప్రయత్నించాడు.

ఎక్కుతున్నప్పుడు ఎడమ చేయి గాల్లో విడిచిపెట్టి విన్యాసాలు చేశాడు. ప్రమాదవశాత్తు కుడిచేయి పట్టు కోల్పోవడంతో 393 అడుగుల లోతున్న అగ్నిపర్వతం బిలంలో పడిపోయి చనిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. అతను ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఎక్కడంతో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *