అక్కినేని నాగార్జున మేనకోడలు, టాలీవుడ్ నిర్మాత సుప్రియ యార్లగడ్డకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కొత్త బోర్డులో కీలక స్థానం దక్కింది. శశి శేఖర్ వేంపటి ఛైర్మన్‌గా కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ పునర్వ్యవస్థీకరించిన 18 మంది సభ్యుల నూతన ప్యానెల్‌లో సుప్రియతో పాటు బాలీవుడ్ ప్రముఖులు ప్రీతి జింటా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, దర్శకుడు ప్రియదర్శన్ తదితరులకు చోటు దక్కించుకున్నారు.

అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డకు సెన్సార్ బోర్డులో చోటుదక్కింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్ శశి శేఖర్ వేంపటి నేతృత్వంలో మొత్తం 18 మంది సభ్యులతో కూడిన నూతన బోర్డును కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఇందులో టాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త సుప్రియ యార్లగడ్డకు స్థానం దక్కింది.
సుప్రియ యార్లగడ్డతో పాటు సినీ, కళారంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు CBFC కొత్త ప్యానెల్‌లో చోటు దక్కింది. నటి ప్రీతి జింటా, పల్లవి జోషి, రూపాలీ గంగూలీ, నటుడు సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, మనోజ్ జోషి, ప్రసేన్‌జిత్ ఛటర్జీ, దర్శకుడు ప్రియదర్శన్, గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్, వినోద్ అనుపమ్, అభిషేక్ జైన్, హన్స్‌రాజ్ హన్స్, యతీంద్ర మిశ్రా, నీలా మాధబ్ పాండా, నిషిగంధ వాడ్, వామన్ కేంద్రే, రమేష్ పతాంగేలను తదితరులను ఇతర సభ్యులుగా నియమించారు.
















































