సందీప్ కిషన్ నటిస్తున్న యాక్షన్-అడ్వెంచర్ మూవీ ‘సిగ్మా’. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా డెబ్యూ చేస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్‌వీఆర్ సినిమాసంస్థలు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ”సిగ్మా సినిమాతో సంజయ్‌ని తెలుగు సినిమాలకి పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. తను చాలా మంచి కుర్రాడు. తన విషయంలో నాకు చాలా గర్వంగా ఉంటుంది. నా ప్రాధాన్యత ఎప్పుడూ తెలుగులోనే ఉంటుంది. కాకపోతే ఒక తెలుగు హీరో తమిళ్‌లో కూడా ఇలాంటి సినిమా చేయగలిగాడు అనేది హ్యాపినెస్ ఇస్తోంది. సంజయ్ కూడా సినీ పరిశ్రమలో చాలా ఎత్తుకు ఎదుగుతాడు. తన తొలి సినిమా నాది కావడం నాకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది” అని అన్నారు.
”తెలుగు ఆడియన్స్ నాకు ఇచ్చిన ప్రేమ, గుర్తింపు చాలా ఎక్కువ. తెలుగు నటుడిగా బ్రతికిన జీవితమే ఎక్కువ. ఒక తెలుగు హీరోగా నేను చాలా గర్వపడతాను. అలాగే తమిళ ప్రేక్షకులు నాకు ఇచ్చిన ప్రేమ, ఆదరణ చూసి ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సంజయ్ తెలుగు సినిమాకి చాలా పెద్ద అభిమాని. దాదాపుగా తను తెలుగు సినిమాలన్నీ చూస్తాడు. సంజయ్ అనుకుంటే ఎవరైనా తనకి హీరోలుగా దొరుకుతారు. కాకపోతే రెండు భాషలకి సరిపోయే హీరో కావాలని, తను అనుకున్న క్యారెక్టర్‌కి బెస్ట్ ఇవ్వాలని నన్ను తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తను 70 రోజుల్లో సినిమా తీస్తానని ప్రొడ్యూసర్లకి చెప్పాడు. 63 రోజుల్లోనే తను అనుకున్నది పూర్తి చేశాడు. నాకు 100% బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చి, తను ఏ కథ చెప్పాడో అదే తీశాడు. తను సినిమాని చాలా జెన్యూన్‌గా ప్రేమిస్తున్నాడు. చాలా జెన్యూన్ ఇంటెన్షన్ ఉంది. సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. మీ అందరికీ నచ్చుతుంది” అని సందీప్ కిషన్ అన్నారు.
‘సిగ్మా’ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు తమిళ్ సినిమా చేయనని సందీప్ కిషన్ తెలిపారు. తాను హీరో అవుతానంటే ఇంట్లో వాళ్లు కూడా నమ్మలేదన్నారు. ”సిగ్మా’ సినిమా కోసం నన్ను హీరోగా తీసుకున్నప్పుడు తమిళ వాళ్లకి ఎలాంటి క్వశ్చన్ రాలేదు. సందీప్ మంచి ఆప్సన్ అన్నారు. కానీ మన దగ్గర మాత్రం సందీప్ ని ఎందుకు తీసుకున్నాడు? అనే డౌట్ వ్యక్తం చేశారు. తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన ‘బాహుబలి’ మూవీకి నెట్‌ఫ్లిక్స్ వాళ్లు డాక్యుమెంటరీ చేశారు. అందులో ఈ సినిమా రిలీజ్ రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్లాప్ అని మాట్లాడారని చెప్పారు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాల విషయంలోనూ అదే జరిగింది. మనోళ్లను మనం పెంచుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం?. మనోళ్లు బయటకు వెళ్లి ఏదైనా గొప్పగా చేస్తున్నారంటే, ‘తెలుగోళ్లు పర్వాలేదు, ఇక్కడ కూడా ఏదో చేయగలరు’ అని వేరే రాష్ట్రాల్లో కూడా మన టాలెంట్ ను గుర్తిస్తున్నారు. అది మన తెలుగు గొప్పదనం” అని సందీప్ కిషన్ ఓ ప్రశ్నకి సమాధానంగా చెప్పారు.
















































