మహిళల వన్డే వరల్డ్ చాంపియన్ భారత్ టీ20 వరల్డ్ కప్‌ను అద్భుత విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్‌లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), బౌలింగ్‌లో దీప్తి శర్మ (5/10), తెలుగమ్మాయి శ్రీచరణి (3/21) విజృంభించడంతో ఆదివారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టీమిండియా 64 రన్స్ తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ : 20 ఓవర్లలో 170/6 (స్మృతి మంధాన 68, హర్మన్‌ప్రీత్ 36, రిచా ఘోష్ 34; ఫాతిమా సనా 2/33, సాదియా ఇక్బాల్ 2/41);
పాకిస్థాన్: 17 ఓవర్లలో 106 ఆలౌట్ (మునీబా 41, దీప్తి శర్మ 5/10, శ్రీచరణి 3/21)

