ఒకప్పుడు మనుషులను దగ్గర చేసిన సోషల్ మీడియా… ఇప్పుడు సమాజంలో విభేదాలు, విద్వేషాలు, నేరాలకు వేదికగా మారుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్, అసభ్య కంటెంట్, సైబర్ మోసాలు, వ్యక్తిగత దూషణలు… రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన అభ్యంతరకర కంటెంట్ కనిపిస్తున్న నేపథ్యంలో మెటాకు సమన్లు జారీ చేయాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశించారు. అలాగే వాట్సాప్‌లో ప్రతిపాదించిన యూజర్‌నేమ్ ఫీచర్‌పై కూడా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. నకిలీ గుర్తింపులతో మోసాలు, డిజిటల్ అరెస్టు స్కామ్‌లు, సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

మరోవైపు సోషల్ మీడియా పోస్టుల కారణంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, యూట్యూబర్లు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేయగా, నటుడు ప్రకాశ్ రాజ్ చేసే పోస్టులు, ప్రశ్నలు తరచూ రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొందరు యూట్యూబర్ల అరెస్టులు, ఇటీవల “ఇడుపుకాయితం” సినిమా టైటిల్ చుట్టూ నెలకొన్న వివాదం కూడా సోషల్ మీడియా ప్రభావంపై ప్రశ్నలు లేవనెత్తాయి.

ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే…

  • సోషల్ మీడియా స్వేచ్ఛకు హద్దులు ఉండాలా?
  • యూజర్లు స్వీయ నియంత్రణ పాటిస్తే సరిపోతుందా?
  • లేక ప్రభుత్వాలు మరింత కఠిన చట్టాలు తీసుకురావాలా?
  • భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలగకుండా… సమాజాన్ని ఎలా రక్షించాలి?

మీ అభిప్రాయం ఏమిటి? సోషల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టాలు అవసరమా? లేక బాధ్యతాయుతమైన వినియోగమే పరిష్కారమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *