ముక్కోణపు సిరీస్లో భాగంగా అఫ్గాన్ A తో జరిగిన మ్యాచ్లో ఇండియా A 101 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత యువ భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. అఫ్గాన్ A 36.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. బాహిర్ షా (57), ఫైసల్ షినోజాదా (46), ఇమ్రాన్ మీర్ (32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. భారత్ A బౌలర్లలో నిషాంత్ సింధు 4, యశ్ ఠాకూర్ 2, అంశుల్ కాంబోజ్, విప్రాజ్ నిగమ్, సుర్యాంశ్, అనుకుల్ రాయ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. అఫ్గాన్ A, శ్రీలంక Aల మధ్య జరిగే మ్యాచ్లో విజేత ఇండియా Aతో తుది పోరులో తలపడనుంది.

ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇండియా Aతో జరుగుతున్న మ్యాచ్లో అఫ్గాన్ A తొమ్మిది వికెట్లు కోల్పోయింది. అబ్దుల్లా అహ్మద్ జాయ్ (6), షమ్స్ ఉర్ రెహ్మాన్ (8)ని నిషాంత్ సింధు వరుస ఓవర్లలో పెవిలియన్కు పంపాడు.

ముక్కోణపు సిరీస్లో భాగంగా అఫ్గాన్ Aతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా A పట్టుబిగిస్తోంది. యశ్ ఠాకూర్ బౌలింగ్లో మహమ్మద్ ఇషాక్ (16) ఆరో వికెట్గా పెవిలియన్ చేరాడు. ఫర్మానుల్లా సఫీ (17)ని సుర్యాంశ్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. 33 ఓవర్లకు అఫ్గాన్ A స్కోరు 204/7. ఆ జట్టు లక్ష్యం 320.

ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇండియా Aతో జరుగుతున్న మ్యాచ్లో అఫ్గాన్ A ఐదు వికెట్లు కోల్పయింది. ఫైసల్ షినోజాదా (46; 56 బంతుల్లో)ని అనుకుల్ రాయ్ రిటర్న్ క్యాచ్లో వెనక్కి పంపాడు. బహిర్ షా (57; 52 బంతుల్లో) విప్రాజ్ నిగమ్ బౌలింగ్లో లో సుర్యాంశ్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా వెనుదిరిగాడు. 27.1 ఓవర్లకు అఫ్గాన్ A స్కోర్ 173/5.

ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇండియా Aతో జరుగుతున్న మ్యాచ్లో అఫ్గాన్ A బ్యాటర్లు పోరాడుతున్నారు. 320 పరుగుల లక్ష్యఛేదనలో అఫ్గాన్ 23 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. బహిర్ షా (44), ఫైసల్ షినోజాదా (41) అర్ధ శతకాలకు చేరువయ్యారు. 320 పరుగుల లక్ష్యఛేదనలో అఫ్గాన్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 18 ఓవర్లకు స్కోరు 124/3. బాహిర్ షా (28), ఫైసల్ షినోజాదా (34) నాలుగో వికెట్కు ఇప్పటివరకు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ముక్కోణపు సిరీస్లో భాగంగా జరుగుతున్న కీలకమైన మ్యాచ్లో భారత్ A బౌలర్లు పట్టుబిగిస్తున్నారు. క్రమం తప్పకుండా వికెట్ల తీస్తూ అఫ్గానిస్థాన్ Aను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ జట్టు 11 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, అంశుల్ కాంబోజ్, నిశాంత్ సింధు తలో వికెట్ పడగొట్టారు. అఫ్గాన్ లక్ష్యం 320 పరుగులు.

ముక్కోణపు సిరీస్లో భాగంగా కీలకమైన మ్యాచ్లో భారత A బ్యాటర్లు దూకుడుగా ఆడారు. అఫ్గానిస్థాన్ Aతో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ తిలక్ వర్మ (59), ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (58), కుమార్ కుషాంగ్రా (58) అర్ధశతకాలు సాధించారు. మిగతా బ్యాటర్ల వైభవ్ సూర్యవంశీ (38), రుతురాజ్ గైక్వాడ్ (30) ఫర్వాలేదనిపించారు. ఆరంభంలో వైభవ్ డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు.అతడు ఇచ్చిన క్యాచన్ను అఫ్గాన్ ఫీల్డర్ పట్టినా.. బంతి నేలకు తాకినట్లు రీప్లేలో తేలింది. సూర్యాంశ్ షెడ్జ్ (7) త్వరగా పెవిలియన్కు చేరాడు. ఆఖర్లో విప్రాజ్ నిగ (30), నిషాంత్ సింధు (21*) విలువైన పరుగులు రాబట్టారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరిదూన్ 2, అబ్దుల్లా 2, ఫర్మనుల్లా 2.. జహీరాఖాన్ 1 వికెట్ తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *