‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఆడియెన్స్ ను కడుపుబ్బా నవించారు. ఇప్పుడు ఈ నవ్వులను మూడింతలు చేసేందుకు ఈ కామెడీ సిరీస్ లో మూడో సీజన్ వచ్చేస్తోంది. తాజాగా దీని ప్రీమియర్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

హైదరాబాద్ : AMB సినిమాస్‌లో జరిగిన “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు అయ్యారు. వారి నవ్వులతో, సందడితో ఈ వేడుక ఆహ్లాదకరంగా మారింది. అతిథులు, సెలబ్రిటీలు, నటీనటులు, సాంకేతిక బృందం మరియు క్రియేటర్లు.. ఇలా అందరూ కలిసి ప్రాంతీయ OTT వినోదంలో పెద్ద హిట్‌గా నిలిచిన సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన సీజన్-3ను బాగా ఎంజాయ్ చేశారు. తారల తళుకులతో మెరిసిన ఈ రెడ్ కార్పెట్ వేడుకకు టీవీ సీరియల్స్ నుంచి సినిమాల ప్రముఖుల వరకు అందరూ హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్లు, హై-ఫ్యాషన్‌లో సెలబ్రిటీల మెరిసే హాజరు, ఎక్స్‌క్లూజివ్ మీడియా ఇంటరాక్షన్లు, అలాగే ప్రీ స్క్రీనింగ్ గెట్-టుగెదర్స్.. ఇలా అన్నీ కలిసి ఈ స్ట్రీమింగ్ ప్రారంభానికి అద్భుతమైన వేదికగా నిలిచాయి.
సేవ్ ది టైగర్స్ 3 స్పెషల్ సెలబ్రిటీ ప్రీమియర్ వేడుకలో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, బిగ్ బాస్ తెలుగు 5 విజేత వీజే సన్నీ, కళ్యాణ్ పడాలా (బిగ్ బాస్ సీజన్ 9 విజేత), చైతన్య రావు, వెంకటేష్ కాకుమాను, కార్తిక్ రత్నం, ఆదిత్య మండల, శ్రీనాథ్ మాగంటి, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, నిరుపమ్, కిరీటి దామరాజు, మానస్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని ప్రీమియర్‌ను ఎంజాయ్ చేశారు.





