ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గిపోయింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 76.79 డాలర్లకు పడిపోయింది. అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడమే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం భారత్‌కు కలిసొస్తుందని అంటున్నారు. భారత్ తాను వినియోగించే చమురులో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు ధరలు తగ్గడంతో దిగుమతి బిల్లులు తగ్గి, రూపాయి బలపడుతుందని విశ్లేషకుల అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *