జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధర్మాజీపేటలో పల్లె దావఖాన నూతన భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడుతూ.
పల్లె దావఖానకు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు లక్షలు ఇచ్చిందన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు చేయొద్దని, నేతల పబ్లిసిటీల కోసం పెట్టిన ఖర్చు ఆరోగ్య కేంద్రానికి వెచ్చిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ధరణి యాప్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రెండు నిమిషాలు మాట్లాడిన ఎంపీ అరవింద్ తనకు పని ఉందని అక్కడి నుండి వెళ్ళిపోయారు.

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ:
తాను రెండున్నర గంటలు ఎంపీ కోసం వేచి చూస్తే, సభ మర్యాద పాటించకుండా మధ్యలోనే వెళ్లిపోయారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి జీఎస్టీ రూపంలో కేంద్రానికి వెళ్లే వంద రూపాయల్లో 41 రూపాయలు మాత్రమే తెలంగాణకు నిధుల రూపంలో ఇస్తున్నారని పేర్కొన్నారు.

యూరియా సరఫరాలో కేంద్రం కొత్త నిబంధనలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేస్తోందన్నారు.
ఎంపీ అహంకారంతో మాట్లాడుతున్నారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైతే తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. పల్లె దావఖానకు నియోజకవర్గం నుండి రెండు లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఎంపీ అరవింద్ వీడియో:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *