కాకినాడ: కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారిపై అటవీ జంతువులు దాడి చేసి ఉంటాయని ఎస్పీ అనుమానాల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు సోమవారం రాత్రంతా విస్తృతంగా గాలించాయి.
డ్రోన్లు, నైట్ ట్రాప్ కెమెరాల సాయంతో అడవిని జల్లెడ పట్టాయి.
అయితే ఆ ప్రాంతంలో జంతువుల కదలికలు కనిపించలేదని ప్రత్యేక బృందాలు వెల్లడించాయి.
క్రూర మృగాలు లేవని అధికారులు స్పష్టం చేయడంతో ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
దాంతో చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా..? ఇంకేమైనా జరిగిందా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *