గుంటూరు: 23ఏళ్ళ యువకుడు సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో హత్యా చేసి ఆనవాళ్లు లేకుండా చేసి డెడ్ బాడీ దహనం చేసారు. ఈ అంశం గురించి జనసేన అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

సాయికృష్ణ మృతిపై గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. సాయికృష్ణ లాకప్ డెత్ చర్చనీయాంశమైంది. గాదె సాయి కృష్ణ మేనమామ నవరంగ్ నా దగ్గరకు వచ్చారు. నేను జనసేన కార్యకర్తను అని నవరంగ్ చెప్పారు. సాయికృష్ణ తల్లి వేదన బాధ కలిగించింది. పార్టీలకు అతీతంగా ఉద్యమ రూపం ఇవ్వాలి. దేశంలోనే ఇటువంటి ఘటన ఎక్కడా జరగలేదు. ఎన్నో లాకప్ డెత్స్ జరిగాయి. కానీ ఇక్కడ చనిపోయితే శవాన్ని మాయం చేశారు. ఏపి పోలీస్ మర్డర్ చేసి శవాన్ని మాయం చేశారు. హెబియస్ కార్పస్ కేసు వేస్తే సాయికృష్ణ కోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు.

సాయికృష్ణ మృతిపై సీబీఐ ఎంక్వయిరీ వేసి న్యాయం చేయండి. పవన్ కల్యాణ్ కు రిక్వెస్ట్ చేస్తున్నాను. చేతులు జోడించి అడుగుతున్నాను పవన్ కల్యాణ్ గారు.. ఎంక్వయిరీ వేయండి. మనం మనుషులం అన్నది గుర్తించాలి. మర్డర్ చేసి కాల్చేయడం చట్టం చేసే పనా. తమిళనాడు ఘటన కన్నా ఘోరమైన ఘటన. చట్టప్రకారం ఉరిశిక్ష వేయాలి. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారు. సీబీఐ ఎంక్వైరీ వేసి న్యాయం చేయండి. సాయికృష్ణను దహనం చేసి ఉంటే కనీసం బూడిదనైనా ఇవ్వమని అతని తల్లి కోరుతోంది. సీబీఐ విచారణ కోరుతున్నా. లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని అంబటి రాంబాబు కోరారు. ఆనంతరరం సాయికృష్ణ మేనమామ నవరంగ్ మీడియాతో మాట్లాడారు.

సాయి కృష్ణ మృతిని పార్టికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఆ తల్లి బాధ చూసి అందరూ చలించిపోతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే దాడి చేసి హత్య చేసి దహనం చేయడమా..సాధారణ వ్యక్తి చనిపోతే ఎవరూ స్పందించ కూడదా. ఆ తల్లి బాధ మరొకరికి రాకూడదు. .దారుణంగా చంపేశారు కాబట్టి న్యాయం చేయమని అడుగుతున్నాం. సాయి కృష్ణ మంచోడు కాదు. మరి మీరు హంతకులు కాదా’అని ప్రశ్నించారు..

మానవతా దృక్పధంతో స్పందించాం. వంగవీటి కుటుంబంతో సంబంధ బాంధవ్యాలున్నాయి. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాకుండా హత్య చేశారు.సాయికృష్ణపై ఒక్క కేసు ఉన్నా బయట పెట్టాలి. తల్లి అడిగినట్లు మృతదేహం అన్నా ఇవ్వాలి లేకపోతే బూడిదన్న ఇవ్వాలి. హోంమంత్రి అనిత గారు…. సాయికృష్ణ హత్య గురించి తప్ప అన్ని విషయాలు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *