తల్లిదండ్రులకు , వాహనదారులకు హెచ్చరిక. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటం తో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు డ్రైవ్ చేయడం బాధ్యతరాహిత్యానికి నిదర్శనంగా చూస్తున్న పోలీసులు మైనర్ పిల్లల తల్లిదండ్రులకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.

గత రెండు రోజుల క్రితం పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలుడు అతి వేగంగా వాహనం నడుపుతూ ఇద్దరు వృద్ధులు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు వృద్ధులు, ఒక మైనర్ మృతి చెందగా మరొక మైనర్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మితిమీరిన వేగంతో మైనర్ వాహనం నడపటం వలనే ఈ ప్రమాదం జరిగింది.

దీంతో పోలీసులు హెచ్చరిక జారీ చేశారు ఇక పై మైనర్లకు వాహనాలు అందజేసి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమానులు మరియు తల్లిదండ్రులు చట్టపరంగా బాధ్యులవుతారని హెచ్చరిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేసి జైలు పాలు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. మైనర్లకు వాహనం ఇవ్వడం చట్టవ్యతిరేకమైన చర్య అని ఆయన వెల్లడించారు.

ఇలాంటి బాధ్యతరాహిత్యం వల్ల జరిగే ప్రమాదాలకు వాహన యజమాని మరియు తల్లిదండ్రులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వరంగల్ సీపీ సూచించారు. మైనర్లు వాహనాలు నడపనివ్వకూడదన్నారు. బాధ్యతగా ప్రవర్తించి ప్రమాదాలను నివారించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మైనర్లకు వాహనాలిచ్చి – అనవసరంగా జైలు పాలు కాకండి ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మైనర్ వాహనం నడపటం కారణంగానే జరిగిందని, అనవసరంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *