టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్‌లో నటిస్తున్నచిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా సమంత తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాను గర్వంగా చెప్పుకోలేని ఎన్నో సినిమాల్లో నటించానంది సామ్. చాలా తక్కువ టైంలోనే ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు.. ఉత్సాహంగా నా పేరును కేకలు వేస్తూ పిలవడం, నా సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఇదంగా చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ స్టార్‌డమ్ అనే మాయలో మునిగిపోయానని చెప్పింది సమంత. అంతేకాదు మీడియా నా గురించి రాస్తోంది. ఏడాదికి నేను ఎన్ని సినిమాల్లో నటించాననే విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపించేదానిని అంటూ చెప్పుకొచ్చింది.
హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలను అందిస్తున్నప్పటికీ తాను అసలు సినిమాకు ఏం ఇస్తున్నానని ఎప్పుడూ కూడా ఆలోచించలేదని చెప్పింది. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ వైపు గృహిణిగా, మరోవైపు వీరవనితలాగే ఉగ్రరూపం చూపిస్తూ సాగుతున్న ట్రైలర్ సినిమాలో సామ్‌ను సరికొత్తగా చూపించబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది.
పెళ్లి అయిన అనంతరం పల్లెటూరికి కోడలిగా వెళ్లిన సమంతకి అక్కడ ఎదురైన సంఘటనలు ఏంటి.. తన గతం ఏంటి అనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు సమంత భర్త రాజ్ నిడిమోర్ ఈ కథను రాయగా.. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా పిక్చర్స్ (Tralala Pictures) దీనిని నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.





