మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ప్రస్తుతం డబుల్ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. ఒకవైపు ఆయన నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తుండగా, మరోవైపు జూన్ 14న రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీంతో మెగా అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది.అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతుల వివాహ వార్షికోత్సవం సంద‌ర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వ‌ర్షం కురిపించారు. 2012 జూన్ 14న వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, టాలీవుడ్‌లో అత్యంత అభిమానించబడే సెలబ్రిటీ కపుల్స్‌లో ఒకరిగా నిలిచింది.

ఈ ప్రత్యేక సందర్భంగా ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. తమ ముగ్గురు పిల్లల చిన్న చేతులను చూపిస్తూ ఓ అందమైన ఫోటోను ఆమె పంచుకున్నారు. ఫోటోతో పాటు “Heart Is Full”(మ‌న‌సు నిండిపోయింది) అనే క్యాప్షన్‌ను జోడించారు. కుటుంబ బంధాలను ప్రతిబింబించే ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇప్పటికే రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వారి కుటుంబంలోకి కవల పిల్లలు కూడా చేరడంతో ఆనందం మరింత పెరిగింది. తాజా ఫోటోలో ముగ్గురు చిన్నారుల చేతులు కనిపించడంతో అభిమానులు మురిసిపోతున్నారు. ఉపాసన పోస్ట్‌పై మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

ఇది కేవలం ఒక ఫోటో కాదు.. ప్రేమ, కుటుంబ బంధం, వారసత్వానికి ప్రతీక, “హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అన్నా-వదినా”, “ఇలాంటి అందమైన కుటుంబాన్ని చూడటం ఆనందంగా ఉంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.అటు ‘పెద్ది’ విజయం, ఇటు వివాహ వార్షికోత్సవం, కుటుంబ ఆనందాలు.. ఇలా అన్ని శుభ పరిణామాలు ఒకేసారి రావడంతో రామ్ చరణ్ కుటుంబంలో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *