ఇదేనా ఇందిరమ్మ రాజ్యం పేదలకు ఇల్లు, పట్టాలు ఇవ్వాలి కానీ వున్నా ఇల్లు లాకోడమేనా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రెవిన్యూ మంత్రిగ వుంటూ జిల్లా ప్రజలను రక్షించాల్సిన వారు భక్షిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సర్వే నెంబర్ 218 భూ బాధితులతో జరిగిన సమావేశం లో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇక్కడి బాధితుల సమస్య తన దృష్టికి తీసుకువచ్చారని హరీష్ రావు తెలియజేసారు. పెదాలను,జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్న పాలకుల తీరుపై మండిపడ్డారు.ఖమ్మం జిల్లా దురదృష్టం కొద్దీ మొన్న వెలుగుమట్లలో ఇల్లు కూల్చివేస్తే రాష్టవ్యాప్తంగా జిల్లా పరువు పోయింధనారు. ప్రత్యేమ్నాయం చూపించకుండా పేదల ఇల్లు లాకోవడం దుర్మార్గం అని మండిపడ్డారు.
జాతీయ రహదారి పక్కన పేదవారి ఇల్లు కట్టుకొని నివసిస్తే ప్రభుత్వానికి కళ్ళు మండుతున్నాయా అని హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతుంటే , ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చుతున్నారని ఆరోపించారు. సర్వే నెంబర్ 218 బాధితులకు గతంలోనే “గృహలక్ష్మి” పధకం కింద ఇల్లు మంజూరయ్యాయని, వాటిని తక్షణమే వారికీ ఇవ్వాలని డిమాండ్ చేసారు. లేదంటే మరో వెలుగుమట్ల తరహా ఉద్యమం పునరావుతి అవుతుందని హరీష్ రావు హెచ్చరించారు.
ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల స్దలాలకు ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టాడని అయన తప్పుబట్టారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు స్థానం కల్పించినపుడు, ఖమ్మం లో ఎందుకు ఇవ్వరని హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.



































