- పవన్ విమర్శలకు ప్రభుత్వం స్పందన: ఏపీ కేబినెట్ విశ్లేషణ
- ఈరోజు కేబినెట్ భేటీతో స్పష్టం: పవన్ విమర్శలపై మంత్రి తీరు
- చంద్రబాబు నిర్ణయాలు: పవన్ విమర్శలకు ప్రభుత్వ ప్రత్యుత్తరాలు
- వైఎస్సార్ విమర్శలపై క్యాబినెట్ ఆదేశాలు: గట్టిగా ప్రతిస్పందించాలి
- పవన్ విమర్శలు vs ప్రభుత్వం: పాలనా మార్గదర్శి భేటీ ఫలితం
ఏపీలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కేబినెట్లో ఇవాళ అజెండా అంశాలపై చర్చ జరిగిన తర్వాత ఎప్పటిలాగే మంత్రులతో సీఎం చంద్రబాబు పిచ్చాపాటీ మాట్లాడారు. ఇందులో ఆయన ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై చంద్రబాబు మాట్లాడారు. ఈ విషయంలో మంత్రులు ఎలా వ్యవహరించాలో చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ మధ్య రాష్టంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చురుగ్గా స్పందిస్తున్నారు. దీంతో విపక్ష వైఎస్సార్సీపీ నేతలు పవన్ లక్ష్యంగా చేసుకొని విమర్శలకు దిగుతున్నారు. ఈ విషయంలో పవన్ కు తన సొంత పార్టీ జనసేన నేతలతో పాటు మంత్రులు, టీడీపీ నాయకుల నుంచి మాత్రం తగిన మద్దతు లభించడం లేదు. దీంతో ఆయనే స్వయంగా వైఎస్సార్సీపీ నేతలకు కౌంటర్లు ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ వ్యవహారాన్ని పవన్ చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినటు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ భేటీలో చంద్రబాబు మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పై వచ్చే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని వారికి బాబు తెలియజేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను వివాదాల్లోకి లాగితే మంత్రులు గట్టిగా స్పందించాలని సూచించారు. దీంతో పాటు వివిధ అంశాలపై వైఎస్సార్సీపీ చేసే విమర్శలకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమాధానం ఇవ్వాలని మంత్రుల్ని చంద్రబాబు కోరారు. తాజాగా విజయవాడలో చోటు చేసుకున్న సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలతో పాటు డీఎస్సీ విషయంలో వైఎస్సార్సీపీ విమర్శలకు అధికార కూటమి నుంచి తగిన స్పందన రాలేదన్న విమర్శల నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.






































