కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారంలో ఇటీవల సీఎం చేసిన విమర్శలపై కిషన్ రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
- హైదరాబాద్ మెట్రో రైలుకు ఐఆర్ఎఫ్ రుణం త్వరగా వచ్చేలా చూడాలని కిషన్ రెడ్డిని కోరారు.
- సమస్య పరిష్కారానికి ఏ మీటింగ్‌కైనా నేను ఎప్పుడైనా సిద్ధం.
- రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో వీలైనంత త్వరగా భేటీ ఏర్పాటు చేయించాలని, ఈ సమావేశానికి సంబంధించి మీ కాల్ కోసం ఎదురుచూస్తాను.
- అన్ని పత్రాలతో వచ్చి స్పష్టత ఇస్తా.
- ఈ అంశాలపై మీతో వ్యక్తిగత భేటీకి కూడా సిద్ధమే, ఎప్పుడైనా డాక్యుమెంట్లు, అధికారాలతో వస్తాను అని రేవంత్ పేర్కొన్నారు.
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, వరంగల్ ఎయిర్‌పోర్ట్‌పై సీఎం సమీక్ష:
అంతకుముందు బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, వరంగల్ ఎయిర్పోర్ట్ అంచనాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.హైదరాబాద్-పోచంపల్లి రైల్వే మార్గంలో మంతిగిరి వద్ద స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అక్కడి నుండి ఐటీ హబ్‌కు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు.
హైదరాబాద్-బెంగళూరు రైల్వే మార్గంలో ఫ్యూచర్ సిటీలో స్టేషన్ ఏర్పాటు చేయాలని, మనూర్ వద్ద నల్లమల స్టేషన్, సోమశిల సమీపంలో స్టేషన్ ప్లాన్ చేయాలని సూచించారు.టూరిజం ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే లైన్ ఉండాలన్నారు. కాకతీయ సామ్రాజ్యం వారసత్వ సంపద ఉట్టిపడేలా వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండాలని సీఎం కిషన్ నిర్దేశించారు. ఎయిర్‌పోర్టు ముందు ధర్మదేవి, రుద్ర దేవుడు తండ్రి విగ్రహంతో ఐలాండ్ ఉండాలన్నారు.
ఎయిర్పోర్ట్ డిజైన్లపై ఢిల్లీ వెళ్లి ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో చర్చించాలని అధికారులకు సూచించారు.















