అమరావతికి తాము వ్యతిరేకం కాదు అని, అక్కడ జరిగే అవినీతికి వ్యతిరేకం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మదనపల్లి లో నిర్వసించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ , కూటమి ప్రభుత్వం పై పలు విమర్శలు చేసారు. మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం తప్ప ఎలాంటి అభివృద్ధి పురోగతి లేదని అయన ఆరోపించాడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయం లో మంజూరైన మెడికల్ కాలేజీ లను కూటమి సర్కార్ అడ్డుకుందని విమర్శించాడు. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే పేద ప్రజలకు వైద్యసేవలు అందుతాయని పేర్కొన్నారు.

మదనపల్లి టౌన్ బ్యాంక్ లో అవకతవకలు జరిగాయి అని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించాడు. ఆ విషయం పై తెలుగు దేశం పార్టీ నేతలే సమాచారం అందించాలని తెలియచెప్పారు. దీనితో పరిస్థితి ఎంతా తీవ్రంగా వుందో అర్ధమవుతుంది అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యవహారం పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసారు. మెడికల్ కళాశాలలు, భూకబ్జాలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరుస్తామని అయన అన్నారు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ పై వ్యక్తిగతంగా ధూషించాటం తప్ప సమాధానం లేదని విమర్శించారు.

డీఎస్సీ పరీక్షలు వ్యవహారం పై ఆయన స్పందించారు. మొదటి ర్యాంక్ సాధించిన అభ్యర్థిని పక్కన పెట్టడం తో లీకేజి వ్యహారం బయటపడింది పరీక్షలు రాసి ఉద్యాగాలు పొందాల్సిన పరిస్ధితి నుండి అడ్డా దారిలో ఉద్యోగాలు పొందడం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. డీఎస్సీ వ్యవహారం లో పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేసారు. రాష్టం లోని మామిడి రైతులు కూటమి ప్రభుత్వ హయంలో తీవ్రంగా నష్టపోయారని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా ఆక్వ రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడు అండగా వుంటారనీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *