నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర పండుగకు సుమారు 20 లక్షల మంది వరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికారులు, నగర మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

భద్రతా ఏర్పాట్లు:

పోలీసు శాఖ సుమారు 2 వేల మందితో పటిష్ట బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసింది.
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అనేక చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లు, ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. రొట్టెల పండుగ జరిగే బారా షాహిద్ దర్గా ప్రాంతంలో వందల సంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిరంతరం నిఘా ఉంచారు. పండుగ చరిత్ర సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రొట్టెల పండుగ యొక్క గొప్పదనం, బారా షాహిద్ దర్గాకు, స్వర్ణాల చెరువుకు ఆ పేర్లు ఎలా వచ్చాయి తెలుసుకుందా..

దర్గా చరిత్ర :

కులమతాలకు అతీతంగా, మతసామరస్యాలకు ప్రతీకగా నెల్లూరు జిల్లాలో ప్రతి ఏటా రొట్టెల పండుగ జరుగుతుంది. మొహరం సందర్భంగా జరిగే ఈ పండుగకు దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. 6వ తేదీ నుంచి జరిగే రొట్టెల పండుగని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రొట్టెల పండుగను ఎందుకు జరుపుకుంటారు అనడానికి ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది.

దర్గా చరిత్ర – రొట్టెల పండుగ నేపథ్యం :

1751లో ఇస్లాం మతాన్ని ప్రచారం చేసేందుకు 12 మంది మతప్రబోధకులు సౌదీ అరేబియా నుంచి ఇండియాకు వచ్చారు.
ఆ సమయంలో తమిళనాడు, నెల్లూరు ప్రాంతాలను నవాబులు పాలించేవారు. సౌదీ నుంచి వచ్చిన ప్రబోధకులు నెల్లూరు జిల్లా దగ్గరి కొడవలూరుకు వెళతారు. అక్కడ ఇతర మతస్థులు వీరిని అడ్డుకుంటారు. వారితో ఈ 12 మంది వీరోచితంగా పోరాడతారు.

ఆ పోరాటంలో సౌదీ వీరులు మరణిస్తారు. అలా చనిపోయిన 12 మంది మృతదేహాలను గుర్రాలు లాక్కొచ్చి స్వర్ణాల చెరువు పక్కన వదిలేస్తాయి. ఆ మృతదేహాలు అక్కడే భూమిలో కలిసిపోతాయి. స్థానికులు ఆ ప్రదేశాలలోనే వారికి సమాధులు కట్టేస్తారు. అలా ఆ దర్గాకు బారాషహీద్ దర్గా అని పేరు వచ్చింది.

రొట్టెల పండుగ – ఆనవాయితీలు, ఏర్పాట్లు :

ర్గా ప్రాంగణంలోని బారాషహిదులను దర్శనం చేసుకుని అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు ఏదైనా కోరికను కోరుకొని ఆ రొట్టెను వదిలే వారి నుంచి తీసుకుంటారు. గత ఏడాది తాము అనుకున్న కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకొని అది నెరవేరితే మరుసటి ఏడాది వచ్చే ఆ రొట్టెను వదులుతామని భక్తులు కోరుకుంటారు. అలా సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె, చదువు రొట్టె, వివాహ రొట్టె, విదేశీ రొట్టె, ఉద్యోగ రొట్టె.. ఇలా 12 రకాల కోరికలకు సంబంధించిన రొట్టెలను ఇక్కడ మార్పిడి చేసుకుంటూ ఉంటారు. పండుగ నిర్వహణ.

గతంలో మొహరం రోజున మాత్రమే ఈ రొట్టెల పండుగను నిర్వహించేవారు. అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం ఏర్పాట్లు రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం స్నానపు గదులు, మహిళల కోసం ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే గదులతో పాటు టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టింది. దొంగతనాలు జరగకుండా పోలీస్ శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాలను సైతం నియమించింది. ఈ ఐదు రోజుల పాటు పారిశుధ్య నిర్వహణపై కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది.

పండుగ కార్యక్రమాలు :

మొదటి రోజున సందల్ మాలి నిర్వహిస్తారు. రెండో రోజున గంధ మహోత్సవం నిర్వహిస్తారు. బారా షహిద్ లకు గంధాన్ని లేపనం చేసిన తర్వాత గంధాన్ని భక్తులకు పంచి పెడతారు. మూడో రోజు రొట్టెల పండుగ. ఇలా ఐదు రోజులపాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ట్రాఫిక్ నియంత్రణ :

రొట్టెల పండుగ ఐదు రోజులు నెల్లూరుకి వాహనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్ పై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వర్ణాల చెరువు దర్గా వద్ద భక్తులకు సౌకర్యాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు స్వర్ణాల చెరువు దర్గా వద్ద ఏడు జోన్లుగా విభజించి సౌకర్యాలు కల్పించారు.

జోన్ల వారీగా కల్పించిన సౌకర్యాలు :

4 జోన్లలో దర్గా, 2వ జోన్లో భక్తుల షెల్టర్లు
3వ జోన్లో వైద్య శిబిరాలు, వీఐపీ రిసెప్షన్
2వ జోన్లో: మహిళలకు 52, పురుషులకు 32 వేర్వేరుగా షవర్బత్‌లు
దుస్తులు మార్చుకునే గదులు, 120 మరుగుదొడ్లు,
3వ జోన్లో పోలీసు కమాండ్ కంట్రోల్ రూం,
2వ జోన్లో పోలీసు అవుట్‌పోస్టు, ఉచిత భోజనం,
1, 2 జోన్లలో భక్తులు రొట్టెలు మార్చుకునే ఘాట్,
1, 2, 3, 5, 6 జోన్లలో హెల్ప్ డెస్క్ వసతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *