టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా మారిపోయారు. ఆమె చేసిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్సే.. బ్రహ్మోత్సవం, రామయ్య వస్తావయ్యా, శాకుంతలం సినిమాలు తప్పించి మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ను ప్రారంభించారు సమంత. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది, మనం, రంగస్థలం, మహానటి, ఓ బేబీ, యశోద ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టి.. హీరోయిన్లలో ఎవరికీ లేని క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఓ బేబీ చిత్రంతో సోలో హీరోయిన్ గా బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి తన స్టామినా ఏంటో నిరూపించారు సమంత. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు.

అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం‘మా ఇంటి బంగారం’. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 19 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. సమంత హోమ్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన మొదటి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రినివాస్ గవిరెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఇటీవల ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్‌ ను జారీ చేసింది. అలాగే ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా ఉంది.

సమంత ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ రివ్యూ చూస్తే.. సామ్ పవర్‌ ఫుల్ రౌద్రరూపం, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా చాలా సాధారణంగా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో కూల్ గా స్టార్ట్ అవుతుంది. కొత్త కోడలుగా సమంత ఫన్, తోటి కోడలు శ్రీముఖితో పోటీ ఇలా చాలా కూల్ గా ఫస్టాఫ్ సాగిపోతుంది. అయితే ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టోరీ మారుతుంది. విలన్స్ వల్ల సమంత సర్వస్వం కోల్పోతుంది. ఆ తర్వాత తన కుటుంబం, ఆత్మగౌరవం కోసం ఎలా తిరగబడ్డారు అనే సీన్స్ థియేటర్లలో ప్రేక్షకుడిని అబ్బుర పరుస్తాయి.

ఇక ఇంటర్వెల్ బ్లాక్‌ లో వచ్చే ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌ వల్ల థియేటర్లు బద్దలైపోవడం ఖాయమని ఇన్‌ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఒళ్ళు గగుర్ పుట్టించే రివెంజ్ సీన్స్ తో చివరి 30 నిమిషాలు ఉత్కంఠభరితంగా సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సమంత 31 వ సినిమాతో మరో భారీ హిట్టును తన ఖాతాలో వేసుకున్నట్లు సమాచారం. ఇక ఫుల్ రివ్యూ కోసం రేపటివరకూ ఆగాల్సిందే మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *