సీఎం విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఏమో గానీ ఆ టైం లో హీరోయిన్ త్రిష బాగా వైరల్ అయింది. వీరిద్దఱు డేటింగ్ లో వున్నారని వార్తలు వొచ్చాయి అదే కాదు విజయ్ వొదిలేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానము నుంచి ఉప ఎన్నిక లో త్రిషతో పోటీచేస్తారని వార్తలు వొచ్చాయి. ఆలా రోజుకో రూమర్స్ తో ఈ జంట వార్తలో నిలిచారు.
సోమవారం(22-06-2026) విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేయగా త్రిష మాత్రం షాక్ ఇచ్చింది. అది ఏమిటి అంటే త్రిష నుండి స్పెషల్ విషెస్ వొస్తాయి అని చూడగా ఆలా ఏమి రాకపోగా విజయ్ ని త్రిష ఇంస్టాలో అన్ ఫాలో చేయటం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇన్నాళ్లు సాగిన వీరి బంధానికి ఫుల్ స్టాప్ పడిందా అని చర్చ జరుగుతుంది. త్రిష విజయ్ ను ఎందుకు ఆలా చేసిందో అని సోషల్ మీడియా లో మాట్లాడుకుంటున్నారు. త్రిష ఎందుకు చేసారో తెలియాలి అంటే ఈ విషయం పై త్రిష స్పందించి క్లారిటీ ఇవ్వాలి. అప్పటి వరకు ఈ చర్చ ఆగదు . ప్రస్తుతం త్రిష తెలుగు లో చిరంజీవి సరసన ‘విశ్వంభర’ లో నటిస్తుంది. ఈ మధ్యే సూర్య ‘వీరభద్రుడు’ మూవీ తో హిట్ అందుకుంది.






































