తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఆయన స్నేహితురాలు త్రిష నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. విజయ్ ని త్రిష అన్ఫాలో చేయడం కూడా చర్చకు దారితీసింది. తాజాగా త్రిష విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. ‘వీటన్నింటి విలువ పెంచే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ఆమె పేర్కొన్నారు. త్రిష స్పందనతో విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





































