తమిళనాడు రాజకీయాల్లో హీట్ మొదలైంది. అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం ముదురుతోంది. అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ.. డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి విజయ్ డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయదని, అవినీతికి తావివ్వదని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై ఉదయనిధి స్పందిస్తూ.. రైతుల ఆందోళనల్ని ప్రతిపక్షాలు ప్రేరేపిస్తున్నాయని చెప్పడం రైతులకు అవమానమే అని అన్నారు. చెంగల్పట్టు కోర్టులో “భర్త కోసం భార్య వెతుకుతున్న కథ” గురించి తెలుసని, సీఎం విజయ్ ఆయన భార్య సంగీతల మధ్య విడాకుల వివాదాన్ని ఉదయనిధి ప్రస్తావించారు.
విజయ్ మాజీ సీఎం స్టాలిన్ హావభావాలను ప్రదర్శించడం వైరల్‌గా మారింది. దీనిపై ఉదయనిధి మాట్లాడుతూ.. అసెంబ్లీని థియేటర్‌గా మార్చారని, యాక్టింగ్ ఆపి పాలన చేయాలని అన్నారు. టీవీకే అసెంబ్లీని షూటింగ్ స్పాట్‌గా మార్చిందని స్పీకర్ యాక్షన్ చెబితే ముఖ్యమంత్రి నటిస్తున్నట్లుగా ఉందని అన్నారు. తర్వాత మేకప్ ఆర్టిస్టులు, స్టంట్ మాస్టర్లు కూడా వస్తారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
- అసెంబ్ల్లో మాటల యుద్దం ముదురుతోంది: తమిళనాడు రాజకీయాల్లో టీవీకేასა కేంద్రంగా అధికార-ప్రతిపక్ష మధ్య తీవ్ర విమర్శలు విస్తరిం చాయి; ముఖ్యమంత్రి విజయ్ డీఎంకెపై తీవ్ర విమర్శలు చేశారు.
- రైతుల ఉద్యమాలు ప్రేరేపించారని ఉదయనిధి ఆరోపణ: Uprయనిధి స్టాలిన్ రైతుల ఆందోళనలను ప్రతిపాక్షాలు ప్రేరేపిస్తున్నాయని చెప్పడం రైతులకు అవమానంగా ఉందని తెలిపారు.
- వివాదాస్పద వ్యక్తిగత వ్యాఖ్యలు: విజయ్-వారి భార్య సంగీతాల మధ్య విడాకుల విషయాలను ఉదయనిధి చర్చలో వినియోగించి రాజకీయ చర్చలో ప్రస్తావించారు.
- అసెంబ్ల్లీ థియేటర్‌గా మారిపోయింది: స్టాలిన్ హావభావాలు వైరలయ్యాయని ఉదయనిధి చెప్పారు; అసెంబ్ల్లీని థియేటర్‌గా మార్చారని, యాక్టింగ్-పాలన కనిపించే విధంగా వ్యాఖ్యానించారు.
- గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ చోటుచేసుకుంది, ప్రభుత్వ విధానంపై విమర్శలు కొనసాగుతాయి.





































